Udayam Digital
Menu

రాజ్యాంగ హక్కులపై అవగాహన అవసరం

Anuroop Nov 27, 2026 10:31 AM రంగారెడ్డి General
రాజ్యాంగ హక్కులపై అవగాహన అవసరం - Udayam Digital
రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని రాంపూర్ సర్పంచ్ వట్టెల నిర్మల–శ్రీశైలం యాదవ్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి, గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేశారు. సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం రాజ్యాంగం కల్పించిన హక్కులని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరిస్తూ కులమతాలకు అతీతంగా సోదరభావంతో ముందుకు సాగాలని సూచించారు.

Comments

G
Loading comments...