వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌ను ఆంక్షలతో బెదిరించాలని చూస్తే అది సదరు దేశాలకే నష్టమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఫోరంలో మాట్లాడిన ఆయన, ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఎల్లప్పుడూ స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే సార్వభౌమ దేశంగా వ్యవహరిస్తుందని కొనియాడారు.
ఆంక్షల ద్వారా భారతదేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ఎప్పటికీ విఫలమవుతాయని పుతిన్ స్పష్టం చేశారు. గతంలో మోదీపై అమెరికా విధించిన ఆంక్షలు, ఆయన ప్రధాని అయ్యాక తొలగిపోవడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
Comments
Loading comments...

