Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులి సంచారంపై ప్రజలకు హెచ్చరిక

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 1:07 PM తూర్పుగోదావరి General
పులి సంచారంపై ప్రజలకు హెచ్చరిక - Udayam
గోపాలపురం మండలం కోమటిగుంటలోని మాతంగమ్మ మెట్ట ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోందన్న సమాచారంతో తహశీల్దార్ మహాలక్ష్మి సోమవారం ప్రజలను అప్రమత్తం చేశారు. రాత్రివేళ ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, పశువులను ఆరుబయట వదలవద్దని సూచించారు. పులి కనిపిస్తే వెంటనే అటవీ, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...