Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరకాల ఆర్టీసీ డిపోలో ఎన్నికల పోలింగ్

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 12:48 PM హన్మకొండ General
పరకాల ఆర్టీసీ డిపోలో ఎన్నికల పోలింగ్ - Udayam
పరకాల ఆర్టీసీ డిపోలో కార్మిక సంఘాల ఎన్నికల పోలింగ్‌ శుక్రవారం కొనసాగుతోంది. కార్మికులు తమకు నచ్చిన యూనియన్‌కు ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి చేరుకుంటున్నారు. హక్కులు, సంక్షేమం, సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిచ్చే నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. డిపో పరిధిలో మొత్తం 242 ఓట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పోలింగ్‌ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది.

Comments

G
Loading comments...