వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణ కొరియా పర్యాటక సంస్థ (KTO) భారతీయ నటి ప్రియాంక మోహన్‌ను కొరియా టూరిజం గౌరవ రాయబారిగా నియమించింది. భారత్, కొరియా దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసేందుకు తనను ఎంపిక చేయడంపై ఆమె సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు.
కొరియా సంస్కృతి, సంప్రదాయాలు తనను ఎంతో ప్రేరేపించాయని, ఈ అరుదైన గౌరవానికి కొరియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రియాంక పేర్కొన్నారు. కొరియన్ సంస్కృతిని భారతీయ ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తానని ఆమె వివరించారు.
Comments
Loading comments...

