Udayam Digital
Menu

ప్రేమ వ్యవహారంతో కూతురిని చంపిన తండ్రి

Harika Nov 26, 2026 10:50 AM ఆదిలాబాద్General
ప్రేమ వ్యవహారంతో కూతురిని చంపిన తండ్రి - Udayam Digital
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రి గ్రామంలో మేనత్త కొడుకును ప్రేమించిందనే కారణంతో 18 ఏళ్ల కళ్యాణిని తండ్రి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. గొంతు నులిమి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఉరికి వేలాడదీసినట్లు వెల్లడైంది. మూడు గంటల్లోనే అంత్యక్రియలు పూర్తి చేయడం, లంబాడ సంప్రదాయాలకు విరుద్ధంగా దహనం చేయడంతో అనుమానాలు వచ్చాయి. విచారణలో కళ్యాణిని తానే చంపినట్లు తండ్రి అంగీకరించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...