వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడి ఇంటి ఎదుట యువతి చేపట్టిన నాలుగు రోజుల నిరసన పోరాటం చివరకు విజయవంతమైంది. ప్రజా సంఘాలు, రాజకీయ నేతల మద్దతుతో పెద్దల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది.
వర్ధన్నపేట మున్సిపల్ ఛైర్మన్ కుమారుడు శ్రీకాంత్, శ్రీదేవి గత కొంతకాలంగా ప్రేమించుకుంటుండగా, పెద్దల జోక్యంతో సమస్య సుఖాంతమైంది. ఇరువర్గాల అంగీకారంతో శ్రీదేవి మెడలో శ్రీకాంత్ తాళి కట్టడంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

