Udayam Digital
Menu

ప్రభుత్వ సైట్‌లో అశ్లీల కంటెంట్ కలకలం

Shruthi Nov 27, 2026 8:40 AM హైదరాబాద్General
ప్రభుత్వ సైట్‌లో అశ్లీల కంటెంట్ కలకలం - Udayam Digital
తెలంగాణ భూగర్భ జలశాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి 'ఓన్లీ ఫ్యాన్స్' అనే పోర్న్ సైట్‌కు అనుసంధానం చేశారు. బోరుబావుల అనుమతులు, నీటి మట్టాల వివరాల కోసం పోర్టల్ తెరిచిన రైతులు, ప్రజలు అశ్లీల లింకులు కనిపించడంతో విస్తుపోతున్నారు. ఆరు నెలల క్రితమే ఈ వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైనప్పటికీ, అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...