వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా భద్రాచలం, పరిసర మండలాల్లో ఏర్పడే ముంపు సమస్యపై సీడబ్ల్యూసీ, పీపీఏ, నీటి పారుదలశాఖ అధికారుల ఉమ్మడి బృందం బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించింది. వరద సమయంలో కిన్నెరసాని, ముర్రేడు వాగుల ఎగపోటు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను స్థానిక అధికారులు వారి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ బృందం భద్రాచలంలోని స్లూయిస్‌లు, దుమ్ముగూడెం బ్రిడ్జి, అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్ ముంపు ముప్పుపై ప్రత్యేకంగా పరిశీలన జరిపింది. 4 మండలాల్లో సాగిన ఈ అధ్యయనం ఆధారంగా నివేదిక రూపొందించనున్నారు.
Comments
Loading comments...

