Udayam Digital
Menu

పింఛన్ల మంజూరులో అక్రమ వసూళ్లు

Shruthi Nov 24, 2026 9:14 AM సూర్యాపేటGeneral
పింఛన్ల మంజూరులో అక్రమ వసూళ్లు - Udayam Digital
సూర్యాపేట జిల్లాలోని పలు పురపాలికల్లో చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ పేరుతో కొందరు కౌన్సిలర్లు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.2,500 నుంచి రూ.5 వేల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. సూర్యాపేటలో 2,098 మందికి, కోదాడలో 889 మందికి పింఛన్లు మంజూరయ్యాయి. తమ వల్లే పింఛన్లు వచ్చాయని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...