Udayam Digital
Menu

ఫోన్ చేసి బయటకు పిలిచి.. సింగరేణి ఉద్యోగి దారుణ హత్య!

Shruthi Nov 23, 2026 9:11 AM మంచిర్యాలGeneral
ఫోన్ చేసి బయటకు పిలిచి.. సింగరేణి ఉద్యోగి దారుణ హత్య! - Udayam Digital
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పవర్‌హౌస్ కాలనీలో సింగరేణి ఉద్యోగి రాజశేఖర్ (30) దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నలుగురు యువకులు పథకం ప్రకారం ఆయనకు ఫోన్ చేసి ఇంటి నుంచి బయటకు పిలిచి కత్తులతో దాడి చేసి హతమార్చారు. సమాచారం అందుకున్న గోదావరిఖని ఒకటో పట్టణ పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...