Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫార్మా అనైతిక మార్కెటింగ్‌ ధోరణులపై కమిటీ

Follow Udayam on Google
Udayam Desk Oct 09, 2026 9:31 AM జాతీయంవాణిజ్యం
ఫార్మా అనైతిక మార్కెటింగ్‌ ధోరణులపై కమిటీ - Udayam
ఫార్మా కంపెనీల అనైతిక మార్కెటింగ్‌ ధోరణులపై పరిశీలనకు రెండు వారాల్లో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. తొలి సమావేశం నుంచి రెండు నెలల్లో సిఫారసులు సమర్పించాలని తెలిపింది. డాక్టర్లకు బహుమతులు, నగదు ప్రయోజనాలు ఇచ్చి మందుల ప్రిస్క్రిప్షన్లపై ప్రభావం చూపుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 2027 జనవరి 29న జరగనుంది.

Comments

G
Loading comments...