వార్తలకు తిరిగి వెళ్లండి

కనగల్ మండలం పగిడిమర్రి గ్రామానికి చెందిన తొరకొప్పుల ఎల్లమ్మ (103) గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. చివరి వరకు ఇతరులపై ఆధారపడకుండా తన పనులు తానే చేసుకునేవారని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఎల్లమ్మకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారిలో ఇద్దరు కుమార్తెలు ఇప్పటికే మృతి చెందారు. శతాధిక వృద్ధురాలి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
Comments
Loading comments...

