వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని పెనుగంగ నది వర్షాభావ పరిస్థితులతో నీరు లేక వెలవెలబోతోంది. సాధారణంగా ఉప్పొంగి ప్రవహించే నదిలో ప్రస్తుతం కొద్దిపాటి నీరే మిగిలింది. ఎండల తీవ్రతతో నీటి మట్టం మరింత తగ్గుతోంది.
వినాయక నిమజ్జనం కోసం నదిలో వేసిన విగ్రహాలు నీరు లేక పైకి తేలడం ఆందోళన కలిగిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లాలో వర్షపాతం గణనీయంగా తగ్గినట్లు సమాచారం.
Comments
Loading comments...

