వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లా బవులువాడ వద్ద శనివారం ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. అల్లూరి జిల్లా జి.మాడుగులలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న వెంకట్ అనే వ్యక్తి ఇక్కడి ఒక బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గత కొంతకాలంగా ఆయన నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు, ఆ కారణంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనా స్థలం నుండి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

