వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా 13.40 కోట్ల ఓట్లను తొలగించారంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటు చోరీ జరిగితే ప్రజాస్వామ్యం ఎలా బతుకుతుందని ఆమె ప్రశ్నించారు.
చలో లోక్‌భవన్ ఆందోళనలో పాల్గొనేందుకు విజయవాడ వెళ్తున్న ఆమెను గన్నవరం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె కారు దిగి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Comments
Loading comments...

