వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోని గుడేబల్లూరులో అక్రమ మొరం మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అధికారుల కనుసైగలోనే ప్రతిరోజూ పదుల సంఖ్యలో టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు.
తహసీల్దార్ స్పందిస్తూ, విషయం ఎస్సై దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కానీ ఎస్సై అందుబాటులోకి రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

