Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకట్టుకుంటున్న ‘ఓ సుకుమారి’ అఫీషియల్ టీజర్

Follow Udayam on Google
Richa Gupta Jun 13, 2026 3:13 PM జాతీయంవినోదం
ఆకట్టుకుంటున్న ‘ఓ సుకుమారి’ అఫీషియల్ టీజర్ - Udayam
తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో భరత్‌దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరికొత్త చిత్రం ‘ఓ..! సుకుమారి’ అధికారిక టీజర్ శనివారం విడుదలైంది. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వరరెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఒక ముఖ్యమైన నిజాన్ని దాచిపెట్టి నాయకుడు పెళ్లి చేసుకోవడం వల్ల జరిగే పరిణామాలను వినోదాత్మకంగా ఈ టీజర్‌లో చూపించారు. మురళీధర్‌గౌడ్, ఝాన్సీ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

G
Loading comments...