వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ షిర్కేలో కోతుల గుంపుతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. సింగరేణి కోల్‌బెల్ట్ ప్రాంతంలోని సీఆర్ మైదానంలో వాకింగ్‌కు వెళ్లేవారిపై కోతులు దూసుకొస్తుండటంతో భయాందోళనకు గురవుతున్నారు.
కోతుల నుంచి తప్పించుకుంటూ నడవడం ప్రమాదకరంగా మారిందని వాకర్లు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి కోతులను పట్టేందుకు బోన్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

