వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై రాజకీయాలు చేయడం తగదని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి వైసీపీకి హితవు పలికారు. ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతోందని, బాధిత కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.
ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై బాధితులకు అండగా నిలిచిందని తెలిపారు. ఇలాంటి విషాద సమయంలో భరోసా ఇవ్వాల్సిందిపోయి, వైసీపీ మీడియా బురద జల్లడం దారుణమని ఆయన మండిపడ్డారు.
Comments
Loading comments...

