వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో వ్యవసాయ పొలంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు కౌశిక్ ప్రాణాలు కోల్పోయాడు. పత్తి తీసేందుకు వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
కళ్లముందే తిరుగాడిన ఒక్కగానొక్క కుమారుడు విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నారి మృతితో ఆ గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
Comments
Loading comments...

