Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్లోటింగ్‌ సౌర విద్యుత్‌ ప్రోత్సాహానికి కొత్త పథకం

Follow Udayam on Google
Anjali Jun 14, 2026 2:20 PM జాతీయంబిజినెస్
ఫ్లోటింగ్‌ సౌర విద్యుత్‌ ప్రోత్సాహానికి కొత్త పథకం - Udayam
దేశంలో ఫ్లోటింగ్ సౌర విద్యుదుత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రత్యేక పథకాన్ని తీసుకురానుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. భారత్‌లో 102 గిగావాట్లకు పైగా ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలున్నాయని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో స్వచ్ఛ ఇంధన రంగంలో భారత్ అగ్రగామిగా ఎదిగిందన్నారు. కేవలం చర్చలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించే దిశగా పునరుత్పాదక ఇంధన రంగంలో దేశం వేగంగా ముందుకెళ్తోందని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...