వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో జారీ చేసే ధ్రువీకరణ పత్రాల్లో కీలక మార్పులు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటివరకు ఉన్న పాత ఫార్మాట్లను రద్దు చేసి, ఇకపై ‘స్వర్ణ గ్రామ/వార్డు సచివాలయం’ పేరుతోనే ఆదాయ, కుల, నివాస సర్టిఫికేట్లను జారీ చేయనున్నారు.
నకిలీ పత్రాల నివారణే లక్ష్యంగా కొత్త సర్టిఫికేట్లలో క్యూఆర్ కోడ్, రాజముద్ర, హాలోగ్రామ్ వంటి భద్రతా ఫీచర్లను చేర్చారు. రాష్ట్రవ్యాప్తంగా పాత స్టేషనరీ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేశారు.
Comments
Loading comments...

