Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత నూతన ఆర్మీ చీఫ్‌గా ధీరజ్ సేథ్

Follow Udayam on Google
Sonia Jun 13, 2026 4:34 PM జాతీయంGeneral
భారత నూతన ఆర్మీ చీఫ్‌గా ధీరజ్ సేథ్ - Udayam
లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ భారత నూతన సైన్యాధిపతిగా నియమితులయ్యారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఈ నెల 30న ధీరజ్ సేథ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన పదవీకాలం 2028 ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్‌గా సేవలందిస్తున్న ధీరజ్ సేథ్‌కు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సైనిక అనుభవం ఉంది. ఆయన ఎడారి ప్రాంతాలతో పాటు జమ్మూ-కాశ్మీర్‌లో కీలక బాధ్యతలు నిర్వహించి, విశేష ప్రతిభ కనబరిచారు.

Comments

G
Loading comments...