Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధార్ వెరిఫికేషన్‌లో కొత్త మార్పులు

Follow Udayam on Google
Amaresh Jun 11, 2026 6:22 PM జాతీయంGeneral
ఆధార్ వెరిఫికేషన్‌లో కొత్త మార్పులు - Udayam
డేటా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆధార్ జిరాక్స్ కాపీల స్థానంలో కేంద్ర ప్రభుత్వం యాప్ ఆధారిత వెరిఫికేషన్ విధానాన్ని తెచ్చింది. హోటళ్లు, ఆస్పత్రులు వంటి చోట్ల జిరాక్స్ ఇవ్వకుండా, కేవలం క్యూఆర్ (QR) కోడ్ స్కాన్ చేయడం ద్వారానే వెరిఫికేషన్ పూర్తి చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ విధానం కోసం యుఐడిఎఐ (UIDAI) ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. దీని ద్వారా పేరు, వయస్సు, ఫోటో వంటి అవసరమైన వివరాలు మాత్రమే స్క్రీన్‌పై కనిపిస్తాయి. దీంతో పౌరుల వ్యక్తిగత సమాచారానికి పూర్తి భద్రత లభిస్తుందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...