వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ మహావీర్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంది. చికిత్స కోసం చేరిన ఐదు నెలల పాప, 18 నెలల బాబు మరణించడం కలకలం రేపింది. సీనియర్ వైద్యులు అందుబాటులో లేక ఫోన్ ద్వారా జూనియర్లకు సూచనలు ఇవ్వడం వల్లే ఈ ఘోరం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆసుపత్రి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

