వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ ప్రశ్నపత్రాల లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులను శిక్షించాలని ఏఐఎస్‌ఎఫ్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరీక్ష రద్దును నిరసిస్తూ బుధవారం హిమాయత్‌నగర్‌లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేసి, పరీక్షల నిర్వహణ బాధ్యతను రాష్ట్రాలకే అప్పగించాలని వారు కోరారు. కేంద్రం నిర్ణయాలతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

