వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రపంచ దేశాల్లో భారత్ గౌరవం ఇనుమడించిందని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మోదీ దేశాభివృద్ధికి నిరంతరం తపించే వ్యక్తని కొనియాడారు.
ఎన్డీయే కూటమి అధికారం కోసం కాకుండా జాతీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తుందన్నారు. రాష్ట్రాల్లో ఎన్డీయే సాధిస్తున్న వరుస విజయాలే తమ సుపరిపాలనకు నిదర్శనమని స్పష్టం చేశారు. ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న మోదీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

