Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిల్కీ మిస్ట్ భారీ ఐపీఓకు సిద్ధం

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 10, 2026 5:08 PM జాతీయంమార్కెట్
మిల్కీ మిస్ట్ భారీ ఐపీఓకు సిద్ధం - Udayam
తమిళనాడుకు చెందిన మిల్కీ మిస్ట్ డెయిరీ ఫుడ్ లిమిటెడ్ జూలై ఆఖరు లేదా ఆగస్టు ప్రారంభంలో రూ.20,350 కోట్ల భారీ ఐపీఓ (IPO)కు రానుంది. దేశీయ డెయిరీ రంగంలోనే ఇది అతిపెద్ద ఐపీఓ కావడం గమనార్హం. ఈ ఐపీఓ ద్వారా రూ.17,850 కోట్ల విలువైన కొత్త షేర్లను జారీ చేయనున్నారు. ఈ నిధులను ఉత్పత్తి సామర్థ్య విస్తరణకు, అప్పులు తీర్చడానికి ఉపయోగించనున్నట్లు కంపెనీ డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది.

Comments

G
Loading comments...