వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పం టమాటా మార్కెట్ సమీపంలోని ఒక ఫ్యాక్టరీలో అక్రమంగా నిలిపిన గ్రానైట్ లారీని పోలీసులు శనివారం రాత్రి సీజ్ చేశారు. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా ఈ రవాణా సాగుతున్నట్లు తనిఖీల్లో గుర్తించారు.
ఈ అక్రమ రవాణాపై మైనింగ్ అధికారులకు సమాచారం అందించామని కుప్పం డీఎస్పీ పార్థసారథి తెలిపారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు.
Comments
Loading comments...

