Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లిలో లేడీ డాన్ అరెస్ట్

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 9:16 PM అన్నమయ్యGeneral
మదనపల్లిలో లేడీ డాన్ అరెస్ట్ - Udayam
భూ కబ్జాలు, చీటింగ్ కేసుల్లో నిందితురాలిగా ఉన్న లేడీ డాన్ కోనేటి సులోచనను మదనపల్లి వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీరుగట్టుపల్లికి చెందిన సులోచనపై గతంలోనే రౌడీషీట్‌తో పాటు 14 కేసులు నమోదయ్యాయి. అమాయకులను మోసం చేయడంతో పాటు హత్యాయత్నం కేసులోనూ ఆమె నిందితురాలిగా ఉన్నారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...