వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా కొత్తవలస వద్ద శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ అజాగ్రత్తగా రైలు పట్టాలు దాటుతున్న ఒడ్డుపేటకు చెందిన నెట్టి నారాయణరావు(40)ను విశాఖ-విజయనగరం రైలు బలంగా ఢీకొట్టింది. ఫోన్లో మమేకమై రైలు రాకను గమనించకపోవడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
పెయింటింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించే ఇంటి పెద్ద ఇలా అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆయన భార్య, ఇద్దరు చిన్న పిల్లలు దిక్కుతోచని స్థితిలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Loading comments...

