Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూదందాల ఆరోపణలు: డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ సస్పెన్షన్

Follow Udayam on Google
Rohit Sharma Jun 08, 2026 4:44 PM హైదరాబాద్General
భూదందాల ఆరోపణలు: డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ సస్పెన్షన్ - Udayam
హౌసింగ్ బోర్డులో భూసేకరణ అధికారిగా పనిచేసిన డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బీఆర్‌ఎస్ హయాంలో ఆయన విలువైన ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించి భూదందాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. హైకోర్టు పరిసరాలతో పాటు విజయనగర్ కాలనీ, తుల్జాగూడ ప్రాంతాల్లో జరిగిన అక్రమలపై విచారణకు ఆదేశించారు. ఈ దందాలకు సహకరించిన సూపరింటెండెంట్ వివేకానంద్‌ను శాశ్వతంగా తొలగించగా, బోనా నాయక్‌ను సస్పెండ్ చేశారు. అక్రమార్కులపై క్రిమినల్ కేసులు పెడతామని మంత్రి స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...