Udayam Digital
Menu

కుటుంబ కలహాలు.. ముగ్గురు చిన్నారుల మృతి

Shruthi Nov 28, 2026 2:39 PM హైదరాబాద్General
కుటుంబ కలహాలు.. ముగ్గురు చిన్నారుల మృతి - Udayam Digital
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలను నీటి సంపులోకి తోసి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Comments

G
Loading comments...