వార్తలకు తిరిగి వెళ్లండి

ఎచ్చెర్ల మండలం కుశాలపురంలోని దుర్గా మహేశ్వర స్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం నాలుగో రోజు అమ్మవారు మహాచండీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
అర్చకులు కాశీభట్ల మురళీశర్మ ఆధ్వర్యంలో సహస్రనామార్చన, చండీస్తోత్ర పారాయణం, మంగళహారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

