Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగూడలో ప్రమాదం.. ఇద్దరు టీచర్లకు గాయాలు

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 11:32 AM మహబూబాబాద్ General
కొత్తగూడలో ప్రమాదం.. ఇద్దరు టీచర్లకు గాయాలు - Udayam
మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం ఎదుళ్లపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ ఉపాధ్యాయులు పెనుక రామస్వామి, దనసరి అంజయ్య విధులకు వెళ్తుండగా పాకాల సమీపంలో ప్రమాదం జరిగింది. రోడ్డుపైకి కోతులు అడ్డురావడంతో బైక్‌ అదుపుతప్పి కిందపడింది. ఈ ఘటనలో ఒకరికి తలకు తీవ్ర గాయం కాగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108లో నర్సంపేట ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స అందిస్తున్నారు.

Comments

G
Loading comments...