వార్తలకు తిరిగి వెళ్లండి

చింతలమానేపల్లి మండలం కోయపల్లిలో ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో పంటలకు నష్టం వాటిల్లుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పొగమంచుతో రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే సాగు కోసం పెట్టుబడులు పెట్టామని, పంటలకు నష్టం జరిగితే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

