వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షకొండ సబ్స్టేషన్ నుంచి తమ గ్రామానికి మరో విద్యుత్ ఫీడర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కోమటికొండాపూర్ రైతులు రాస్తారోకో చేపట్టారు. పంటల సాగు కోసం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించారు.
రైతుల నిరసనతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం సర్పంచ్ పద్మజ ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

