Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కందుకూరులో పోలీసుల కార్డన్ సెర్చ్

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 11:51 AM నెల్లూరుGeneral
కందుకూరులో పోలీసుల కార్డన్ సెర్చ్ - Udayam
కందుకూరు పట్టణంలోని నాంచారమ్మ కాలనీలో గురువారం సీఐ జగదీష్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్సైలు భార్గవ్, మరిడి నాయుడు, సిబ్బంది ప్రతి ఇంటినీ తనిఖీ చేసి వాహనాల పత్రాలను పరిశీలించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ కాలనీవాసులతో ప్రతిజ్ఞ చేయించారు.

Comments

G
Loading comments...