క్లోరిన్ గ్యాస్ లీకేజీతో కలకలం

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లిలో మంగళవారం క్లోరిన్ గ్యాస్ లీకేజీ కలకలం రేపింది. పైలెట్ ప్రాజెక్టు వద్ద 500 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకు నుంచి గ్యాస్ లీకైంది.
ఘాటైన వాసనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో చేరుకుని ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.
Comments
Loading comments...
