వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ పునఃపరీక్ష వేళ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నియంత్రణలు విధించింది. పరీక్ష ముగిశాక పాత మెసేజ్‌లను ఎడిట్ చేస్తూ లీకేజీ వదంతులు సృష్టిస్తున్న ముఠాల ఆటకట్టించేందుకు, జూన్ 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది.
అలాగే జూన్ 22 వరకు టెలిగ్రామ్ ప్లాట్‌ఫాం యాక్సెస్‌పై తాత్కాలిక నిషేధం ఉంటుంది. అయితే ఈ నిర్ణయం వల్ల దేశంలోని 15 కోట్ల మంది వినియోగదారులకు శిక్ష పడినట్లయిందని టెలిగ్రామ్ ఎండీ పావెల్ దురోవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

