వార్తలకు తిరిగి వెళ్లండి

కాటారం తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం ప్రమాదం తప్పింది. తహసీల్దార్ కూర్చునే గదిలో ఫ్యాన్తో సహా సీలింగ్ కూలి కంప్యూటర్లపై పడింది. ఉదయం సిబ్బంది గది తెరిచి చూడగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
తహసీల్దార్ సీటుపైనే సీలింగ్ కూలినా, ఆ సమయంలో ఆయనతో పాటు సిబ్బంది అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. భవనంలోని ఇతర ప్రాంతాల్లోనూ పైకప్పు పెచ్చులు ఊడిపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

