Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్జి కుర్చీలో కూర్చుని.. ‘ఆర్డర్‌ ఆర్డర్‌’ అన్న మహిళ!

Follow Udayam on Google
Smriti Jun 14, 2026 12:24 PM జాతీయంGeneral
జడ్జి కుర్చీలో కూర్చుని.. ‘ఆర్డర్‌ ఆర్డర్‌’ అన్న మహిళ! - Udayam
యూపీలోని వారణాసి జిల్లా కోర్టులో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. జడ్జి సెలవులో ఉండగా వందనా గుప్తా (50) అనే మహిళ నేరుగా కోర్టులో జడ్జి కుర్చీలో కూర్చుంది. సుత్తితో కొడుతూ ‘ఆర్డర్‌ ఆర్డర్‌.. విచారణ ప్రారంభించండి’ అనడంతో లాయర్లు అవాక్కయ్యారు. కిందకు దిగేందుకు ఆమె ససేమిరా అనడంతో, మహిళా పోలీసులు కిందకు దించారు. ఆమె మానసిక స్థితి బాగాలేదని గుర్తించిన పోలీసులు.. కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Comments

G
Loading comments...