వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా కొండవెలగాడలో రీసర్వే గ్రౌండ్ ట్రూతింగ్ పనులను జేసీ ఎస్. సేధు మాధవన్ గురువారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో భూ రికార్డుల ధృవీకరణ, సరిహద్దుల నిర్ధారణ పనులను ఆయన తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు. రీసర్వే ప్రక్రియ పారదర్శకంగా, ఖచ్చితత్వంతో జరగాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని ఆయన ఆదేశించారు.
Comments
Loading comments...

