వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు మంగళవారం (మే 26) నుండి ప్రారంభం కానున్నాయి. ధర్మశాల వేదికగా జరగనున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. లీగ్ దశలో చెరో 18 పాయింట్లతో టాప్-2 లో నిలిచిన ఈ జట్లలో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది.
ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన ఎనిమిది మ్యాచ్‌ల్లో చెరో నాలుగు విజయాలతో సమవుజ్జీగా ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ కోహ్లీ, భువనేశ్వర్‌లపై ఆధారపడుతుండగా, గుజరాత్ జట్టు గిల్, రషీద్ ఖాన్‌లపై ఆశలు పెట్టుకుంది. ధర్మశాల పిచ్ ఛేజింగ్‌కు అనుకూలించనుంది.
Comments
Loading comments...

