వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడం, చమురు ధరలు ఎగిసిపడటంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాలతో ప్రారంభమై, చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 47.01 పాయింట్లు లాభపడి 77,616.40 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 4.10 పాయింట్ల స్వల్ప లాభంతో 24,211.00 వద్ద ముగిసింది.
ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభాల్లో రాణించగా.. టాటా స్టీల్, ఇండిగో, మారుతీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 95.62గా నమోదైంది.
Comments
Loading comments...

