వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ‘పొరుగు దేశాలకు ప్రాధాన్యం’ విధానంలో నేపాల్ అత్యంత కీలక భాగస్వామి అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బుధవారం ఢిల్లీలో నేపాల్ అధికార పార్టీ 'రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ' ఛైర్మన్ రబీ లామిఛానేతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఉమ్మడి అభివృద్ధి, శ్రేయస్సు కోసం కలిసి పనిచేయాలన్న ప్రతిపాదనను మోదీ స్వాగతించారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు, నేపాల్‌లోని నూతన ప్రభుత్వంతో కలిసి నడవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన 'ఎక్స్' వేదికగా ప్రకటించారు.
Comments
Loading comments...

