వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లంతకుంట మండలంలో అక్టోబర్ 15, 16 తేదీల్లో కొత్త ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించనున్నట్లు తహశీల్దార్ రాచకట్ల సురేశ్ తెలిపారు. ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
అర్హులైన యువత ఫారం-6 నింపి సంబంధిత బీఎల్ఓలకు అందజేయాలని, ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని తహశీల్దార్ సూచించారు.
Comments
Loading comments...

