Back to feed
శ్రీవారి అన్నప్రసాద ట్రస్టుకు భారీ డిపాజిట్లు
Neelam Sharma Jun 11, 2026 2:33 AM తిరుపతి 11 views4 days ago

శ్రీవారి అన్నప్రసాద ట్రస్ట్‌కు భక్తుల విరాళాల ద్వారా రూ.2,500 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు సమకూరాయి. ఈ నిధుల వడ్డీతో టీటీడీ నిత్యం మహాయజ్ఞంలా ఉచిత అన్నదానాన్ని నిర్వహిస్తోంది. రోజుకు 15.8 టన్నుల బియ్యంతో పాటు భారీగా సరుకులను వినియోగిస్తూ సుమారు 3 లక్షల మంది భక్తులకు నాణ్యమైన భోజనం, అల్పాహారం అందిస్తున్నారు.
ఈ ఏడాది ఐదు నెలల్లోనే 4.40 కోట్లకు పైగా సర్వింగ్స్ అందించారు. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం ద్వారా ఆకలితో వచ్చే భక్తుడికి తృప్తిగా భోజనం పెడుతున్నారు.
Comments
Loading comments...

