హైదరాబాద్ శివార్లలో భారీ వర్షం
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో గంటపాటు భారీ వర్షం కురిసింది. ఇస్నాపూర్, పటాన్‌చెరు, అమీన్‌పూర్, ఆర్సీ పురం, బీరంగూడ, కొల్లూరు, కీసర, ఘట్‌కేసర్, అనోజిగూడలో వర్షం దంచికొట్టింది.
పలుచోట్ల రహదారులు జలమయమై, కొన్ని వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. ట్రాఫిక్ మందగించడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Comments
Loading comments...
